మహబూబాబాద్//జూలై 29(ఆకాంక్ష) :

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం భవాని నగర్ తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన సాయి అనే యువకుడు మృతి చెందినట్లు సమాచారం.భవాని నగర్ తండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.మృతుడు సాయి రాజమండ్రికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.