కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి కొండాపూర్ నాయకుల ఘన సన్మానం...

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మానుక సత్యంను కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొండాపూర్ గ్రామ ఉప సర్పంచ్ రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నేవూరి రత్నాకర్, నాయకులు సురేందర్ రెడ్డి, రాఘవులు, తోట రవి తదితరులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మానుక సత్యం నాయకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేయాలని వారు సూచించారు. కార్యకర్తల ఐకమత్యమే పార్టీ విజయానికి సోపానమని, అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టేలా మండలంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ శ్రేణులు, గ్రామస్థులు పాల్గొన్నారు.