పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో విషాద ఘటన..

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పాత వ్యవసాయ బావి నిరంతరం కూలుతూ ఉండడంతో దానికి మరమ్మత్తులు చేస్తూ చుట్టూ గాజులు వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా భావి కూలడంతో అక్కడే పని చేస్తున్న ఇద్దరు కూలీలు బావి కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఒక మృతదేహాన్ని బయటకి తీయగా మరో మృతదేహం బావిలోనే ఇరుక్కపోయినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.